అభివృద్ధి పనుల్లో జాప్యం వద్దు

Thu,December 5, 2019 03:52 AM

-శరవేగంగా పూర్తి చేయాలి
-జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు కోవ లక్ష్మి
-జైనూర్‌లో కాంట్రాక్టర్లతో సమావేశం
-ఐదు జీపీలకు ట్రాక్టర్లు పంపిణీ

జైనూర్‌: అభివృద్ధి పనుల్లో జాప్యం వద్దని జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి అన్నారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో స్థానిక నాయకులు, కాంట్రాక్టర్లతో మాట్లాడారు. మండలంలో అభివృద్ధి పనులకోసం పెద్ద ఎత్తున నిధులు మంజూ రు చేశామనీ, కానీ ఇప్పటివరకు పనులు పూర్తి కాకపోవడంపై కారణాలు అడిగి తెలుసుకున్నారు. పనులు శరవేగంగా పూర్తి చేయాలని సూచించా రు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందన్నారు. అనంతరం జైనూర్‌తో పాటు భూసిమెట్ట, గౌరికొలాంగూడ, జం గాం, డబోలి గ్రామపంచాయతీలకు ట్రాక్టర్లు పం పిణీ చేశారు. రాష్ట్ర హజ్‌కమిటీ స భ్యుడు ఇంతియాజ్‌లాల, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ కనక యా దవ్‌రావ్‌, ఎంపీపీ తిరుమల, వైస్‌ ఎంపీపీ చిర్లె లక్ష్మణ్‌, ఎంపీడీవో దత్తారాం, సర్పంచులు మ డావి భీంరావ్‌, మోతుబాయి మా దవ్‌రావ్‌, భీంరావ్‌, శ్యాంరావ్‌, నాగోరావ్‌, పార్వ తీ లక్ష్మణ్‌, నాయకులు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.

15
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles