భూసమస్యల పరిష్కారానికి కృషి

Thu,December 5, 2019 03:51 AM

దహెగాం: భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని జిల్లా ప్రత్యేకాధికారి ఇన్‌చార్జి ఆర్డీవో ప్రతిక్‌ జైన్‌ న్నారు. బుధవారం తాసిల్‌ కార్యాలయంలో భూరికార్డులను పరిశీలించారు. మండల కేంద్రంలో పాటు బోర్లకుంట, గిరివెల్లి, పంబాపూర్‌, ఐనం, గొర్రెగుట్ట, గ్రామాలకు చెందిన పలువురు రైతులు భూ సమస్యల పరిష్కారానికి ఆర్డీవో కార్యాలయంలో అర్జీలు పెట్టుకోగా సదరు రైతుల భూరికార్డులను పరిశీలించి సంబంధిత రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుకున్నారు. ఈ సందర్భంగా మట్లాడుతూ భూములకు చెందిన ఎలాంటి సమస్యలు ఉన్న రెవెన్యూ చట్టాలను అనుసరించి పరిష్కరిస్తామన్నారు. ట్రైనీ కలెక్టర్‌ హేమంత్‌, తాసిల్దార్‌ సాయన్న, ఆర్‌ఐ ఆత్రం చిన్ను, వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.

17
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles