పెద్దపులుల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ

Thu,December 5, 2019 03:51 AM

-టైగర్‌ కారిడార్‌కుఇది అనుకూల ప్రాంతం
-నేషనల్‌ టైగర్‌ కన్జర్వేటర్‌(బెంగుళూర్‌ ఫారెస్టు అధికారి మురళి
-పెంచికల్‌పేట్‌ ఫారెస్ట పరిశీలన
-రాబందుల సంతతి గురించి ఆరా

పెంచికల్‌పేట్‌ : పెద్దపులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని నేషనల్‌ టైగర్‌ కన్జర్వేటర్‌(బెంగుళూర్‌) అటవీ అధికారి మురళి అన్నారు. బుధవారం పెంచికల్‌పేట్‌ రేంజ్‌ అటవీ ప్రాంతాన్ని ఫారెస్టు అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మ్యాపుతో పాటు పులి అడుగులను గుర్తించినట్లు పేర్కొన్నారు. కాగజ్‌నగర్‌ అడవి టైగర్‌కారిడార్‌ ప్రాంతానికి అనుకూలంగా ఉందన్నారు. టైగర్‌జోన్‌ ఏర్పాటు అయితే ఇక్కడి ప్రజలకు మరింత మందికి ఉపాధి లభిస్తుందన్నారు. పులుల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రాబందులు ఇక్కడ ఉండడం అ రుదుగా ఉందన్నారు. వాటి సంతతి గురించి జిల్లా ఫారెస్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. పులులు , రాబందుల సంరక్షణ పై సం తృప్తి వ్యక్తం చేశారు. వీరి వెంట ఆదిలాబాద్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ వినోద్‌కుమార్‌, జిల్లా ఫారెస్టు అధికారి లక్ష్మణ్‌రంజిత్‌నాయక్‌, ఎఫ్‌డీవోలు విజయ్‌కుమార్‌, లావణ్య, ఎఫ్‌ఆర్వో వేణుగోపాల్‌, డిప్యూటీ ఎఫ్‌ఆర్‌వోలు రమాదేవి, ప్రభాకర్‌, ఎఫ్‌ఎస్‌వో జగన్మోహన్‌గౌడ్‌, సిబ్బంది ఉన్నారు.

26
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles