సర్కారుతోనే గ్రామాలు సస్యశ్యామలం

Tue,December 3, 2019 11:29 PM

రెబ్బెన: తెలంగాణ సర్కారు సహకారంతోనే గ్రామాలు సస్యశ్యామలం అవుతున్నాయని జడ్పీటీసీ వేముర్ల సంతోశ్‌ పేర్కొన్నారు. మండలంలోని పాసి గాం గ్రామంలో మంగళవారం శ్మశాన వాటిక, డంపింగ్‌యార్డు నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి గ్రామానికి ఎంతో అవసరమైన శ్మశాన వాటిక, డంపింగ్‌యార్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు చురుకుగా కొనసాగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శ్రీనివాస్‌, నాయకులు జుమ్మిడి ఆనందరావు, భుజంగరావు పాల్గొన్నారు.

34
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles