మిషన్‌ ఇంద్రధనుష్‌ పకడ్బందీగా చేపట్టాలి

Mon,December 2, 2019 10:56 PM

జైనూర్‌: మిషన్‌ ఇంద్రధనుష్‌ కార్యక్రమంపై నిర్లక్ష్యం చేయకుండా పకడ్బందీగా చేపట్టాలని జైనూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్‌ నాగేంద్ర ఏఎన్‌ఎంలు, సిబ్బందికి సూచించారు. సోమవారం మండలంలోని జామ్ని గ్రామంలో నిర్వహిస్తున్న మిషన్‌ ఇంద్రధనుష్‌ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గర్భిణులు, 2 నుంచి 5 ఏళ్ల లోపు చిన్నారులకు టీకాలు వేయాలని పేర్కొన్నారు. మిషన్‌ ఇంద్రధనుష్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. డిసెంబర్‌ నుంచి మార్చి వరకు కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. సిబ్బంది గ్రామాల్లో పర్యవేక్షించి ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించాలని సూచించారు. కార్యక్రమంలో హెల్త్‌ సూపర్‌వైజర్‌ కిశోర్‌, లక్ష్మికుమారి, రమేశ్‌, హెల్త్‌అసిస్టెంట్లు విజయ్‌, వినోద్‌, ప్రవీణ్‌, ఏఎన్‌ఎంలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles