నేడే జిల్లా స్థాయి సైన్స్‌ఫెయిర్‌

Sun,December 1, 2019 11:43 PM

కాగజ్‌నగర్‌ రూరల్‌: పట్టణంలోని ఫాతిమా కాన్వెంట్‌లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సోమవారం 47వ జవహర్‌లాల్‌ నెహ్రూ జిల్లా స్థాయి సైన్స్‌ఫెయిర్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎంఈవో భిక్షపతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెండు రోజుల పాటు నిర్వహించే సైన్స్‌ఫెయిర్‌కు అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి వచ్చే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లా నుంచి సుమా రు 280 ఎగ్జిబిట్స్‌ తయారు చేసి 300 మంది విద్యార్థులు రానున్నారు. సైన్స్‌ఫెయిర్‌కు వచ్చే వారు ఉదయం 8.30 గం టల లోపు ఫాతిమా కాన్వెంట్‌ హైస్కూల్‌కు చేరుకోవాలని సూచించారు.

ఏర్పాట్ల పరిశీలన
ఫాతిమా కాన్వెంట్‌లో నిర్వహించే సైన్స్‌ఫెయిర్‌ కార్యక్రమ ఏర్పాట్లను జిల్లా విద్యాశాఖ అధికారి ఫాణిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ, వివిధ మండలాల నుంచి వచ్చే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నా రు. ఉదయాన్నే వచ్చిన విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ కౌం టర్‌ వద్ద ఎగ్జిబిట్స్‌ పేర్లను నమోదు చేయాలని సైన్స్‌ అధికారి మధుకర్‌కు సూచించారు. ఆయన వెంట ఎంఈవో, ఉపాధ్యాయులు ఉన్నారు.

33
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles