సమాజ సేవలో యువకుల పాత్ర కీలకం

Sun,December 1, 2019 11:42 PM

కెరమెరి: సమాజ సేవలో యువకుల పాత్ర కీలకమని ఎంపీపీ పేందోర్‌ మోతీరాం, జడ్పీటీసీ సెడ్మకి దుర్పతబాయి పేర్కొన్నారు. ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివాసీ మిత్ర వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతూ రక్తం కోసం వేచి చూస్తున్న వారికి ఊరట కలిగిస్తుందని చెప్పారు. యువకులు రక్తదానం చేసేలా ఈ సొసైటీ ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. అదే తరహలో ఎయిడ్స్‌పై సమాజంలో చైతన్యం తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారి సుంకన్న, ఎస్‌ఐ రమేశ్‌, ఫార్మసిస్ట్‌ ఖలీల్‌ హుస్పేని, సామాజిక కార్యకర్త సుజాయిత్‌ఖాన్‌, మాజీ కోఆప్షన్‌ సభ్యుడు షేక్‌ ఖుత్బోద్దీన్‌, సొసైటీ సభ్యులు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

జైనూర్‌: ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినోత్సవం సందర్భంగా ఆదివారం జైనూర్‌, ఉషెగాం పీహెచ్‌సీల నుంచి వైద్య సిబ్బంది ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి నావిద్‌ అహ్మద్‌ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఎయిడ్స్‌ మహమ్మారిని తరిమి వేసేందుకు కృషి చేయాలని సూచించారు. ఎయిడ్స్‌ బారిన పడకుండా చేపట్టాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హెల్త్‌సూపర్‌వైజర్లు లక్ష్మికుమారి, కిశోర్‌, రమేశ్‌, హెచ్‌ఏ విజయ్‌, భరత్‌, ప్రవీణ్‌, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
రెబ్బెన: ఎయిడ్స్‌ దినోత్సవం సందర్భంగా ఆదివారం గోలేటి ఆశ్రమ ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలాం ఆర్గనైజేషన్‌ ఆదిలాబాద్‌ జిల్లా కోఆర్డినేటర్‌ ఓరగంటి రంజిత్‌ మాట్లాడుతూ ఎయిడ్స్‌కు మందు లేదని వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు రిబ్బన్‌ ఆకారంలో కూర్చున్నారు. కార్యక్రమంలో ఆశ్రమ పాఠశాల ఇన్‌చార్జి బానోత్‌ దేవయ్య, సంస్థ నియోజక వర్గ ఇన్‌చార్జి పెంటపర్తి తిరుపతి, సభ్యులు రాజశేఖర్‌, తిరుపతి పాల్గొన్నారు. అలాగే రెబ్బెనలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఆధ్వర్యంలో ఎయిడ్స్‌ నివారణపై అవగాహన ర్యాలీ తీశారు. కార్యక్రమంలో డాక్టర్‌ వినోద్‌, ఫీల్డ్‌ సిబ్బంది కమలాకర్‌, పీహెచ్‌సీ సిబ్బంది, తదితరులు పాలొన్నారు.
వాంకిడి: మండల కేంద్రంలో జాతీయ సేవా పథకం ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఆదివారం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు ఎయిడ్స్‌ నివారణపై అవగాహన ర్యాలీ తీశారు. స్థానిక కళాశాల నుంచి ప్రధాన రోడ్డు గుండా బస్టాండు వరకు ర్యాలీ తీశారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ జిల్లా ప్రాజెక్టు అధికారి చంద్రయ్య, అధ్యాపకులు సంతోష్‌, తదితరులు పాల్గొన్నారు.

తిర్యాణి: మండలంలోని చెలిమెల, తిర్యాణి ఆశ్రమ పాఠశాలలో వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కాలాం ఆర్గనైజేషన్‌ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్‌ ఓరుగంటి రంజిత్‌ ఆధ్వర్యంలో ఆదివారం విద్యార్థులు ఎయిడ్స్‌ నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. చింతపల్లి నుంచి కుమ్రం భీం చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వీరస్వామి, ఆ సంఘం నాయకులు తిరుపతి, శశి, రాజశేఖర్‌, సంతోశ్‌, నగేశ్‌, పలు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్‌ టౌన్‌: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల విద్యార్థుల బస్టాండు కూడలి నుంచి ప్రభుత్వ దవాఖాన వరకు ర్యాలీ నిర్వహించారు. ఎయిడ్స్‌ నిర్మూలించి మంచి సమాజాన్ని నిర్మిద్దామని నినాదాలు చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ కళాశాల ప్రోగ్రాం ఆధికారి శ్రీనివాస్‌రావు, అధ్యాపకులు వేణు కుమార్‌, బాలకృష్ణ, వినోద్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు పాల్గొన్నారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles