మహిళల రక్షణకే షీటీంలు

Fri,November 29, 2019 10:58 PM

మహిళల రక్షణకే ప్రభుత్వం షీటీంలను ఏర్పాటు చేస్తున్నాదని కాగజ్‌నగర్‌ డీఎస్పీ బీఎల్‌ఎన్‌ స్వా మి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభు త్వ జూనియర్‌ కళాశాలలో షీటీంపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ మహిళల భద్రతకు 24 గంటల పోలీసులు అందుబాటులో ఉంటారన్నారు. విద్యార్థులు కొత్తవారిని నమ్మవద్దని, కొత్త పరిచయం మోజులో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. లక్ష్యాన్ని ఎంచుకొని మంచిగ చదువుకొని భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. కార్యక్రమం లో సీఐ మోహన్‌, ఎస్‌ఐ రవి కుమార్‌, గంగన్న, ప్రిన్సిపాల్‌ శ్రీధర్‌ సుమన్‌, పోలీసులు, షీటీం సభ్యులు పాల్గొన్నారు.

48
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles