శాంతి భద్రతల రక్షణకే కార్డన్‌ సెర్చ్‌

Fri,November 29, 2019 10:58 PM

కాగజ్‌నగర్‌ రూరల్‌ : శాంతి భద్రతల రక్షణకే కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నామని కాగజ్‌నగర్‌ డీఎస్పీ బీఎల్‌ఎన్‌ స్వామి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ద్వారకానగర్‌ ఏరియాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కా లనీల్లో అనుమానితులు సంచరిస్తే పోలీసులకు స మాచారం అందించాలన్నారు. మైనర్లకు వాహనా లు ఇవ్వద్దన్నారు. పత్రాలు లేని 20 బైక్‌లు, గు ట్కా, పొగాకు ను స్వాధీనం చేసుకొని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌హెచ్‌వో మోహన్‌, రూరల్‌ సీఐ నరేందర్‌, ఎస్‌ఐలు రవి, రాజ్‌కుమార్‌, గంగన్న, లచ్చన్న, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles