పనుల్లో నాణ్యత లోపించవద్దు

Sun,November 17, 2019 12:19 AM

రాష్ట్రస్థాయి క్రీడలకు చేస్తున్న ఏర్పాట్లలో నాణ్యత లోపించవద్దని ఐటీడీఏ పీవో కృష్ణాదిత్య అన్నారు. శనివారం స్థానిక కొమురం భీం ప్రాంగణంలో నిర్వహిస్తున్న గ్రౌండ్ల పనులను పర్యవేక్షించా రు. ఈనెల 27 నుంచి ఉట్నూర్ కేంద్రంగా జరగనున్న రాష్ట్రస్థా యి క్రీడల ఏర్పాట్లలో ఎటువంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే పనులలో నాణ్యత లోపించకూడదని సూచించారు. గ్రౌండ్లలో ఏర్పాటు చేస్తున్న 400 మీటర్ల ట్రాక్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ కోర్టుల పనులను పర్యవేక్షించారు. అ నంతరం మాట్లాడుతూ క్రీడాకారులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే గిరిజన విద్యార్థులకు ఉపయోగపడేలా శాశ్వత మైదానాన్ని ఏర్పాటు చేయడంలో లోపాలు ఉండకూడదన్నారు.అమైదానం సమీపంలో శాశ్వత స్టేజీని చక్కటి మోడల్‌తో నిర్మించాలని సూచించారు. మైదానంలో బాల బాలికల కు వేర్వేరుగా శాశ్వత ప్రతిపాదికన మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇం జినీరింగ్ డీఈ తానాజీ, సీఎంఓ జగన్, జిల్లా క్రీడాధికారి పార్థసారథి, పీడీ లు హేమంద్, లక్ష్మ ణ్, రవీంద ర్, శ్రీనివాస్, ప్రేమ్‌సింగ్, మధుసూదన్, తదితరులున్నారు.

71
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles