విద్యా సామర్థ్యాన్ని పెంపొందించాలి

Sun,November 17, 2019 12:19 AM

ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ: విద్యార్థుల్లో కనీస అభ్యాసన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు అన్నారు. శనివారం విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరలో సమా వేశం నిర్వహించారు. పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులను సిద్ధం చేయాలని సూచించారు. అభ్యాసన దీపికలను ఉపాధ్యాయులు అం కిత భావంతో అమలు చేయాలని సూచించారు. ఈ వారం లో అభ్యాసన దీపికలను ప్రతి పాఠశాలకు అందేలా చేస్తామన్నారు. దీనికి ఎంఈవోలు, ప్రధాన ఉపాధ్యాయులు బాధ్యతగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. జిల్లాలోని 58 ప్రభుత్వ పాఠశాలలకు అందించిన రూ. 1 కోటి విలువ చేసే ప్రయోగ పరికరాలను సద్వినియోగం చేసుకోవాలన్నా రు. అభ్యాసన కరదీపికను విడుదల చేశారు. అసిస్టెంట్ కలెక్టర్ హేమంత్, సీపీవో కృష్ణయ్య, డీఈవో పాణిని,సెక్టోరల్ అధికారి జబ్బార్ , తదితరులున్నారు.

32
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles