క్రీడా స్ఫూర్తి చాటాలి

Sat,November 16, 2019 12:54 AM

బెల్లంపల్లి టౌన్: క్రీడా స్ఫూర్తిని చాటాలని సీఐ జగదీశ్ క్రీడాకారులకు పిలుపునిచ్చారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏఎంసీ గ్రౌండ్‌లో కొనసాగుతున్న రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నీ శుక్రవారం రెండో రోజుకు చేరుకుంది. సీఐ క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ ప్రతి క్రీడాకారుడు గెలుపే లక్ష్యంగా ఆడాలనీ, ఓటమి చెందితే లోపాలను తెలుసుకుని గెలుపు కోసం పోరాడాలని సూచించారు. రెండో రోజు ఖమ్మం-కాగజ్‌నగర్ జట్ల మధ్య పోటీ కొనసాగింది. ఖమ్మం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని 20 ఓవర్ల నాలుగు బంతుల్లో 117 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. కాగజ్‌నగర్ 19 ఓవర్లు మూడు బంతుల్లో 108 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. ఖమ్మం జట్టు 9 వికెట్ల తేడాతో కాగజ్‌నగర్‌పై విజయం సాధించింది.

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles