-సురక్షిత ప్రయాణంతో గమ్యస్థానాలకు ప్రయాణికులు
-ప్రత్యామ్నాయ చర్యలపై ప్రజల సంతృప్తి
-శుక్రవారంవారం ఒక్కరోజే 48 బస్సుల్లో 6వేల మంది ప్రయాణం
ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ: జిల్లాలో అన్ని రూట్లలో ఆర్టీసీ బస్సులను అధికారు లు నడిపిస్తున్నారు. ప్రయాణికులకు ఎలాం టి ఇబ్బందులు తలెత్తకుండా సరిపడా బ స్సులను అందుబాటులో ఉంచుతున్నారు. ఆర్టీసీ, డీటీసీ, పోలీస్ అధికారులు సమన్వ యంతో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.
48 బస్సుల్లో రాకపోకలు
జిల్లా వ్యాప్తంగా శుక్రవారం 48 బస్సులను ఆర్టీసీ అధికారుల నడిపించారు. ఇందు లో 20 ఆర్టీసీ ,18 హైర్ బస్సులు ఉన్నా యి. 40 మంది డ్రైవర్లు, కండక్టర్లు విధుల్లో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 6 వేలకు పైగా ప్రయాణికులను ఆర్టీసీ బస్సుల ద్వారా గమ్యస్థానాలకు చేర్చారు. ప్రస్తుతం అన్ని రూట్లలో బస్సులు నడుస్తుండడంతో, ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్నా, ప్రభుత్వం తీసుకున్న ప్రత్యామ్నాయ చర్యలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.