స్నేహ పూర్వకంగా మెలగాలి

Sat,November 16, 2019 12:53 AM

మంచిర్యాల రూరల్: జిల్లాలోని అన్ని శా ఖల అధికారులు ప్రజలతో స్నేహ పూర్వకంగా మెలగాలని కలెక్టర్ భారతి హోళికేరి ఆదేశించా రు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జాయింట్ కలెక్టర్ వై సురేందర్ రావు, డీసీపీ ఉదయ్‌కుమార్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ రాహుల్‌రాజ్, అస్టిటెంట్ ట్రైనీ కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలసి రెవెన్యూ అధికారులు, సిబ్బందితో శుక్రవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించా రు. ఆమె మాట్లాడుతూ జిల్లాలోని అన్ని రెవె న్యూ కార్యాలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు తో పాటు అగ్ని ప్రమాదం నుంచి కాపాడేందు కు రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజావాణి, గ్రామసభల సమయంలో పోలీస్ శాఖ అధ్వర్వంలో భద్రతా ఏర్పాట్లు చేసేలా ప్రభు త్వ ఆదేశాలు అందాయన్నారు. అన్ని రెవెన్యూ కార్యాలయాల్లో భద్రతా సిబ్బంది, ప్రతి కార్యాలయానికి రెండు ద్వారాలు ఉండేలా చూసుకో వాలని అధికారులకు సూచించారు. ప్రజలు తాసిల్దార్ కార్యాలయానికి సాయంత్రం 3 నుంచి 5 గంటల సమయంలో, ప్రజావాణి రోజు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వచ్చేలా సమయ పాలన పాటించాలన్నారు. కార్యాలయానికి సంబంధించి వసతులు లేని పరిస్థితిపై నివేదిక తయారు చేసి పంపితే ప్రభుత్వానికి పంపుతామని చెప్పారు. జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వర్, ఆర్డీఓ సురే శ్, కలెక్టరేట్ కార్యాలయం పరిపాలన అధికారి సురేశ్, జిల్లాలోని తాసిల్దార్లు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, ట్రైసా అధ్యక్షుడు శ్రీనివాస్ రావ్ దేశ్‌పాండే, కార్యదర్శి కృష్ణ, వీఆర్‌వోల సంఘం అధ్యక్షుడు ఏసయ్య, కార్యదర్శి ప్రవీ ణ్, తదితరుల పాల్గొన్నారు.

ఓటరు జాబితా, పరిశీలన పూర్తి చేయాలి
జిల్లా పరిధిలోని 002- చెన్నూర్(ఎస్సీ), 003-బెల్లంపల్లి(ఎస్సీ), 004-మంచిర్యాల శాసన సభ నియోజకవర్గంలో భారత ఎన్నికల సంఘం ఆదేశాలతో ఓటరు పరిశీలనతో పాటు సంక్షిప్త ఓటరు జాబితా సవరణ నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్, ఎన్నికల అధికారి భారతి హోళికేరి ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్ల పరిశీలన, పోలింగ్ కేంద్రాల రేషనైలేజేషన్‌తో పాటు ఇతర కార్యక్రమాలను ఈ 30వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. డిసెంబ ర్ 16న ఓటర్ల ఇంటిగ్రేటెడ్ డ్రాప్ట్ ప్రచురణ, 16 నుంచి 15 జనవరి, 2020 వరకు ఉం టుందనీ, అభ్యంతరాల స్వీకరణ 27 జనవరి, 2020 వరకు స్వీకరించి, పరిశీలించడం జరుగుతుందన్నారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో 01 జనవరి, 2020 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు తమ వివరాలను బూత్ స్థాయి అధికారుల వద్ద, సంబంధిత వెబ్‌సెట్, మొబైల్ ఆప్ ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. ఓటరు కార్డులో తప్పులు, చిరునామా ఇతరాత్ర సవరణ కావాల్సిన వారు సంబంధిత ఫారం ద్వారా దరఖాస్తు చేసుకొని సవరించుకోవాలన్నారు. అవకాశాన్ని అర్హతగల ఓట ర్లు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles