పకడ్బందీగా సర్వే చేపట్టాలి

Fri,November 15, 2019 03:31 AM

-గర్భిణులు, పిల్లల వివరాలు సేకరించాలి
-మిషన్ ఇంద్రధనుష్ రాష్ట్ర పరిశీలకుడు డాక్టర్ అతుల్

జైనూర్ : గతంలో టీకాలు పొందనివారెవరూ తప్పిపోకుండా పకడ్బందీగా సర్వే చేపట్టాలని మిషన్ ఇంద్రధనుష్ రాష్ట్ర పరిశీలకుడు డాక్టర్ అతుల్ ఆశవర్కర్లు, ఏఎన్‌ఎంలు, వైద్యసిబ్బందికి సూచించారు. మండలంలో గురువారం చేపట్టిన మిషన్ ఇంద్రధనుష్ సర్వేను ఆయన పరిశీలించారు. మండలంలోని ఎన్‌ఎన్ తండా, ఉషేగాం, మార్లవాయి, జామ్ని, పొచ్చంలొద్ది గ్రామాల్లో సందర్శించారు. అనంతరం ఉషేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సర్వే చేసిన బృందాన్ని పిలిపించి, వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో మిషన్ ఇంద్రధనుష్ కింద ఇచ్చిన టీకాలు పొందని ప్రతి ఒక్కరి వివరాలూ ఈ సర్వేలో నమోదు చేయాలని సూచించారు. రెండేళ్లలోపు పిల్లలతో పాటు గర్భిణుల వివరాలు సేకరించాలని పేర్కొన్నారు. డిసెంబర్, జనవరి, ఫ్రిబవరి, మార్చి నెలల మొదటివారంలో వారికి టీకాలు అందించడం జరుగుతుందన్నారు. గ్రామాలకు ఇతర ప్రాంతాల నుంచి అతిథులుగా వస్తే, వారిని కూడా వేరే కాలంలో నమోదు చూపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు జితేందర్ రెడ్డి, హెచ్‌ఎస్ కిషోర్, లక్ష్మీకుమారి, సిబ్బంది సాంబలక్ష్మి, భూలక్ష్మి, అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు, తదితరులున్నారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles