కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు

Wed,November 13, 2019 11:18 PM

జైనూర్: ఆరుగాలం శ్రమించి సోయా పండించిన రైతులకు మద్దతు ధర దక్కేలా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయిస్తున్నదనీ, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సహకార సంఘం చైర్మన్ జాహెద్‌ఖాన్ పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ గోదాంలో ఏర్పాటు చేసిన సోయా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం క్వింటాల్ సోయాకు రూ.3710 మద్దతు ధర చెల్లిస్తుందన్నారు.

రైతులు సోయా పంట అమ్మకానికి తీసుకవచ్చే సమయంలో ఖాతా పాస్‌పుస్తకం, బ్యాంకు అకౌంట్ నెంబర్, ఏఈవో ధృవపత్రాము జిరాక్స్ కాపీలు తీసుకొని రావాలని సూచించారు. రైతులు దళారుల మాటలు నమ్మి తక్కువ ధరకు అమ్మి నష్టపోవద్దని, ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరకు పంటను విక్రయించి లబ్ధిపొందాలన్నారు. కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు చిర్లె లక్ష్మణ్, సర్పంచ్ పార్వతి లక్ష్మణ్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గెడాం లక్ష్మణ్, సహకార సంఘం కార్యదర్శి జనార్దన్, మార్కెట్ కమిటీ కార్యదర్శి దేవన్న, సిబ్బంది మధు, తదితరులు పాల్గొన్నారు.

25
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles