‘కార్తీక’ కాంతులు

Wed,November 13, 2019 02:18 AM

కౌటాల : కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం భక్తులు ప్రాణహిత, పెనుగంగా నదుల్లో స్నానాలు ఆచరించి సమీ పంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివా లయం ప్రధాన అర్చకులు అంబేద శంకరయ్య, సంతోష్‌ తీర్థ ప్రసాదాలు అందజేశారు.

బెజ్జూర్‌ : మండల కేంద్రంలోని శివాలయంలో మంగళవా రం ఎస్‌ఐ సాగర్‌ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయకమిటీ సభ్యులు ఆయన్ను సన్మానించారు. అనంతరం రంగనాయక విగ్రహ చిత్రపటాన్ని ఎస్‌ఐకు బహూకరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు జిల్లాల సుధాకర్‌ గౌడ్‌, సభ్యులు సామల బాలాజి, కోండ్ర నరేందర్‌ గౌడ్‌, సామల రవికాంత్‌, ఏలేశ్వరం పురుషోత్తం చారి, సామల రాజన్న, తంగడిపల్లి నీలేశ్‌ ఉన్నారు.
పెంచికల్‌పేట్‌ : మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో మంగళవారం కార్తీకపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులు తెల్లవారుజామునే పెద్దవాగు తీరాన స్నానాలు ఆచరించి పూజలు నిర్వహించి దీపాలను వెలిగించారు.
సిర్పూర్‌(టి)రూరల్‌: మండలంలోని లోనవెల్లి వెంకటేశ్వర ఆలయంలో భజనలు చేస్తూ గోపాలకాల నిర్వహించి ఉట్టి కొట్టారు. అనంతరం భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. అలాగే టోంకిన శ్రీసిద్ధి హనుమాన్‌ ఆలయంలో పూజలు నిర్వహించారు. పూజారులు జ్ఞానేశ్వర్‌, వెంకన్న, మోహ న్‌రావు, భక్తులు పాల్గొన్నారు.

సామూహిక వ్రతాలు
దహెగాం : మండలంలోని చిన్నరాస్పల్లిలో మంగళవారం సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. ఎంపీపీ సులోచన ఆర్‌ఎస్‌ఎస్‌ సంతోష్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో వేద పండుతుడు మోహన్‌రావ్‌ శర్మ, గ్రామస్తులు ఉసిరి చెట్టు వద్ద వ్రతాలను చేపట్టారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ తుమ్మిడె అమృత, గ్రామ పెద్ద కంభని కేశాగౌడ్‌, భక్తులు పాల్గొన్నారు. గంగస్నానానికి మల్లన్న దేవుడు
మండలకేంద్రంలోని రావుల మల్లన్న ఉత్సవ విగ్రహాన్ని మంగళవారం గంగస్నానానికి తీసుకెళ్లారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు.

ఈజ్‌గాం ఆలయంలో దీపారాధన..
కాగజ్‌నగర్‌రూరల్‌ : మండలంలోని ఈజ్‌గాం శివమల్లన్న ఆలయంలో లక్ష దీపారాధన చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకాన్ని నిర్వహించారు. అలాగే పట్టణంలోని త్రినేత్రాలయం, గణేశ్‌ మందిర్‌, కన్యాకాపరమేశ్వరి, వెంకటేశ్వర, కుసుమహరనాథ ఆలయాల్లో దీపారాధన చేశారు. ఆలయ కమిటి ఛైర్మన్‌ రాజేశ్వర్‌రావు, ఈవో వామన్‌రావు, ఆలయ అర్చకులు సంతోష్‌ శర్మ, నరహరి శర్మ, ఆలయకమిటి సభ్యులు మమిడాల మమత, అమిత్‌దాస్‌, శివప్రసాద్‌, భక్తులు పాల్గొన్నారు.
సిర్పూర్‌(టి): మండలంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం భక్తులు పూజలు నిర్వహించారు. ఉదాయన్నే గంగాస్నానం ఆచరించి మండలకేంద్రంలోని శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కార్తీక దీపాలను వెలిగించారు.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles