నిరంతరం సురక్షితం..

Wed,November 13, 2019 02:17 AM

ఆసిఫాబాద్‌ టౌన్‌: జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రజల కు నిరంతరం సురక్షిత సేవలు అందుతూనే ఉన్నాయి. జిల్లాలో మంగళవారం యథావిధిగా ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. జిల్లా వ్యాప్తంగా బస్సులను ఎలాంటి ఇ బ్బందులు లేకుండా ఆర్టీసీ అధికారులు నడిపించారు. ప్రయాణాని కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యా మ్నాయ చర్యలపై ప్రయాణికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

48 బస్సులు.. ఆరు వేల మంది
ఆసిఫాబాద్‌ డిపో పరిధిలో 48 బస్సులను అధికారులు మం గ ళవారం నడిపించారు. ఇందులో 30 ఆర్టీసీ బస్సులు కాగా, 18 హై ర్‌ బస్సులు నడిపించారు. 60 మంది తాత్కాలిక పద్ధతిలో డ్రైవర్లు, కండక్టర్లు విధులు నిర్వర్తించారు. హైదరాబాద్‌కు ప్రత్యేక సర్వీస్‌ను ఏర్పాటు చేశారు. దాదాపుగా 6 వేల మంది ప్రయాణికులను వారి వారి గమ్యస్థానలకు చేర్చినట్లు డీఎం కృష్ణమూర్తి తెలిపారు. దీంతో మంచిర్యాల, ఉట్నూర్‌, చంద్రాపూర్‌, రాజురా, బెజ్జూర్‌, పెంచికల్‌పేట్‌, కాగజ్‌నగర్‌, కౌటాల, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల కు బస్సు సౌకర్యం కల్పించారు.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles