క్యాంపు కార్యాలయం ప్రారంభం

Wed,November 13, 2019 02:17 AM

కాగజ్‌నగర్‌టౌన్‌ : పట్టణంలో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి మంగళవారం ఎమ్మెల్యే కోనప్ప గృహ ప్రవేశం చేశారు. ప్రభుత్వం నియోజకవర్గ కేంద్రాల్లో క్యాంపు కార్యాలయం పేరిట రూ. 1.50 కోట్లతో నివాస భవనాన్ని నిర్మించింది. ఎమ్మెల్యే కోనప్ప ఆయన సతీమణి రమాదేవి , కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలకు రమాదేవి చీరలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం ఈ భవనం నిర్మించిందన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సీపీ విద్యావతి, డాక్టర్‌ దామోదర్‌, కోనేరు వంశీ కృష్ణ, సీపీ రాజ్‌కుమార్‌, బాలు, గిరీష్‌, సుజాత, ప్రకాశ్‌, తదితరులు పాల్గొన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles