అన్ని రూట్లలో బస్సులు

Tue,November 12, 2019 02:55 AM

-జిల్లాలో ఎప్పటిలాగే రాకపోకలు
-సోమవారం 32 ఆర్టీసీ, 18 అద్దెవి..
-5వేల మంది ప్రయాణం

ఆసిఫాబాద్ టౌన్ : జిల్లా వ్యాప్తంగా అన్ని రూట్లలో సోమవారం ఆర్టీసీ అధికారులు బస్సులను యథావిధిగా నడిపించారు. 32 ఆర్టీసీ, 18 ప్రైవేట్ బస్సులు వివిధ రూట్లలో రాకపోకలు సాగించాయి. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా డిపో అధికారులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. తాత్కాలిక సిబ్బందిని ఏర్పాటు చేసి, ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. సోమవారం ఆదిలాబాద్, మంచిర్యాల, ఉట్నూర్, సిర్పూర్, కాగజ్‌నగర్, కౌటాల, బారేగూడ, కెరమెరి, జోడెఘట్, పెంచికల్‌పేట్, బెజ్జూర్‌కు 50 బస్సులు రాకపోకలు సాగించాయి. దాదాపుగా 5 వేల మంది ప్రయాణికులను తరలించినట్లు డిపో మేనేజర్ కృష్ణమూర్తి తెలిపారు. సమయానికనుగుణంగా బస్సులు కేటాయించగా, విద్యార్థులు సకాలంలో పాఠశాలలకు హాజరవుతున్నారు.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles