మహనీయుడి ఆశయ సాధనకు కృషి చేయాలి

Tue,November 12, 2019 02:53 AM

జైనూర్: దేశం కోసం సేవలందించిన మహనీయుడు మౌలానా అబుల్‌కలాం ఆజాద్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంఏ ఆజాద్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ అసద్‌అలీ సూచించారు. సోమవారం మండల కేంద్రం లో జాతీయ విద్యా దినోత్సవం, భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్‌కలాం ఆజాద్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఎంఏ ఆజాద్ చౌరస్తాలో ఆజాద్ యువజన సంఘం సభ్యులు ప్రార్థనలు చేశారు. అనంతరం ప్రభుత్వ ఉర్దు పాఠశాలలో విద్యార్థులకు ఆయన జీవిత చరిత్రపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు షేక్ అబ్బు, పాఠశాల చైర్మన్ అయ్యుబ్ పఠాన్, సంఘం సభ్యులు షేక్ ఫైసల్, ఫెరోజ్, విద్యార్థులు, నాయకులు పాల్గొన్నారు.

రెబ్బెన: మండలంలోని నక్కలగూడ ప్రభుత్వ పాఠశాలలో ఎంపీపీ జుమ్మిడి సౌందర్య, జడ్పీటీసీ వేముర్ల సంతోశ్ ఆధ్వర్యంలో సోమవారం జాతీయ విద్యా దినోత్సవం, భారత తొలి విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఇందిరానగర్ సర్పంచ్ దుర్గం రాజ్యలక్ష్మి, కోఆప్షన్‌సభ్యుడు జౌరోద్దీన్, ఉపసర్పంచ్ వడ్లూరి తిరుపతి, పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కల్వల శంకర్, కార్యదర్శి దోడ్డిపట్ల రవికుమార్, వార్డు సభ్యులు శ్యాంరావు, విద్యా కమిటీ చైర్మన్ మీసా ల పోచమల్లు, ఉపాధ్యాయులు దేవరకొండ రమేశ్, తదితరులు పాల్గొన్నారు.

ఆసిఫాబాద్,నమస్తే తెలంగాణ: మౌలానా అబుల్‌కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో ముస్లిం మైనార్టీ నాయకులు సోమవారం రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మహెముద్, నాయకులు అబ్దుల్ ఫయాజ్, జాకీర్, రహమాన్, అర్షద్, తదితరులు పాల్గొన్నారు.
రెబ్బెన: మండల కేంద్రంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ ఎంఏ జాకీర్ ఉస్మాని భారత మొదటి విద్యాశాఖ మంత్రి అబుల్‌కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అధ్యాపకులు మల్లేశ్, గణేశ్, సమ్మయ్య, శరత్, రమేశ్, సౌమ్య, తదితరు లు పాల్గొన్నారు.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles