మిలాద్ ఉన్ నబీ వేడుకలు

Mon,November 11, 2019 01:09 AM

ఆసిఫాబాద్ : మహ్మద్ ప్రవక్త జన్మించిన రోజును పురస్కరించుకొని ఆసిఫాబాద్ మండల కేంద్రంలో ఆదివారం ముస్లింలు మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని వీధుల్లో ర్యాలీ తీశారు. ఆసిఫాబాద్ డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
కెరమెరి : మండల కేంద్రంలో ముస్లింలు భారీ ర్యాలీ తీశారు. శనివారం రాత్రి ఆయా గ్రామాల్లోని మసీదుల్లో దేవుని పాటలు పాడుతూ ప్రత్యేక నమాజ్ చేశారు. ఆదివారం ఉదయం గోయగాం, సుర్దాపూర్, ధనోర, ఝరితో పాటు సుల్తాన్‌గూడకు చెందిన ముస్లింలు కెరమెరికి చేరుకొని సుల్తాన్‌గూడ దాకా ర్యాలీ చేపట్టారు.
వాంకిడి : మండల కేంద్రంలోని మసీదు నుంచి కొత్త బస్టాండ్ దాకా ప్రధాన రోడ్డు గుండా ముస్లింలు జెండాలు చేతబట్టి నినాదాలు చేస్తూ భారీ ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. వాంకిడి ఉప సర్పంచ్ పవన్‌సాయి ఆధ్వర్యంలో వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మైనార్టీ మండలాధ్యక్షుడు ఎస్‌కే హమీద్, ఉప అధ్యక్షుడు చాంద్, మైనార్టీ నాయకులు హఫిజ్ సాధిఖ్ రజా, అలీం హస్నాయిన్ రజా, తదితరులున్నారు.

27
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles