లింగ నిర్ధారణ నేరం

Sat,November 9, 2019 05:43 AM

- అడ్డదారులు తొక్కితే కఠిన చర్యలు
- జిల్లా వైద్యాధికారి కుమ్రం బాలు

ఆసిఫాబాద్ టౌన్ : లింగ నిర్ధారణ నేరమని జిల్లా వైద్యాధికారి బాలు అన్నారు. గర్భస్త పిండ లింగ నిర్ధారణ సలహా మండలి కమిటీ చైర్మన్ హోదాలో శుక్రవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. లింగ నిర్దారణ చట్టం 1994 ప్రకారం జిల్లాలో ఉన్న స్కాన్ సెంటర్ల నిర్వహకులు తప్పనిసరిగా డీఎంహెచ్‌వో కార్యాలయంలో రిజిష్టర్ చేసుకోవాలన్నారు. అడ్డదారులు తొక్కితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కేంద్రాల్లో పుట్టబోయే బిడ్డ ఆడ లేక మగ అనే వివరాలు చెప్పినా.. అడిగిన కూడా నేరమేనన్నారు. కేంద్రా ల్లో స్కానింగ్ చేసిన రిపోర్టులను మూడేళ్ల వరకు భద్రపరుచాలని సూచించారు. దేశంలో సెక్స్ నిష్పత్తి 1991లో 945/1000 ఉండగా, 20 01లో 927/1000 ఉందనీ, 2011లో 914/1000గా నమోదైందన్నారు. ప్రతి వెయ్యి మంది బాలురకు 20 ఏళ్ల నాటికి 914 మంది మాత్రమే బాలికలు ఉంటున్నారని తెలిపారు. జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు నమోదైన చైల్డ్ సెక్స్ నిష్పత్తి 927/1000గా నమోదైందనీ, రాష్ట్ర వ్యాప్తంగా ఇది 929/1000గా ఉందన్నారు. భవిష్యత్తులో ఈ సమస్యను అధిగమించేందుకు అందరు సహకరించాలని కోరారు. సమావేశంలో వైద్యాధికారులు సుబ్రహ్మణ్యం, విద్యావతి, సుధాకర్‌నాయక్, రమణారెడ్డి, ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
57
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles