పత్తి కొనుగోళ్లకు సర్వం సిద్ధం

Fri,November 8, 2019 12:59 AM

-జిల్లా వ్యాప్తంగా 14 కేంద్రాల ఏర్పాటు
-ఈ నెల 15 నుంచి ప్రారంభం
-క్వింటాలుకు మద్దతు ధర రూ. 5,500
-లైసెన్స్‌లున్న వ్యాపారులకే అవకాశం
-రైతులను మోసగిస్తే చర్యలు తప్పవంటున్న అధికారులు

కుమ్రం భీం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో పత్తి కొనుగోళ్లు ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. రైతులు ఎలాంటి ఇ బ్బందులు పడకుండా 14 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది సుమారు 2 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఇటీవల కురిసన వర్షా లు కొంత నష్టం జరిగే అవకాశముండగా, సుమారు 13 లక్షల క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే జైనూర్, సిర్పూర్, కెరమెరి, రెబ్బెన, కాగజ్‌నర్, బెజ్జూర్, కౌ టాల, లింగాపూర్ మండలాల్లో పత్తి ఏరడం ప్రారంభమైంది. ఈ ఏడాది రూ. 5,550 మద్దతు ధర ప్రకటించింది.

14 కొనుగోలు కేంద్రాలు
జిల్లాలోని అన్ని మండలాల రైతులకు అందుబాటులో ఉండేలా 14 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆరు జిన్నిం గ్ మిల్లుల్లు, వాంకిడిలో రెండు జిన్నింగ్‌లు, కొండపల్లి ఎక్స్‌రోడ్‌లోని 4 జిన్నింగ్‌లు, జైనూర్, కౌటాలలో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. పత్తిలో 8 శాతం తేమ ఉంటే ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం క్వింటాలుకు రూ. 5,550 చెల్లించనున్నారు. 9 నుంచి 12 శాతం వరకు తేమ ఉన్న పత్తికి కాస్త తక్కువ ధర చెల్లించనున్నారు. రైతులు దీనిని దృష్టిలో పెట్టుకొని నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పత్తిని తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు. దళారులు, ప్రైవేటు వ్యాపారులకు పత్తి అమ్మి రైతులు నష్టపోవద్దని కోరుతున్నారు. సీసీఐ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుండగా, కొనుగోళ్లు ప్రారంభించే అవకాశమున్నది.

రైతులను మోసగిస్తే కఠిన చర్యలు
జిల్లాలో లైసెన్స్ కలిగిన వ్యాపారస్తులకు బహిరంగ మార్కెట్‌లో కూడా పత్తిని కొనుగోలు చేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ప్రభు త్వం నిర్ణయించిన మద్దతు ధర చెల్లించని వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకునేంకుంటామని వారు హెచ్చరిస్తున్నారు. పత్తికి తక్కువ ధర చెల్లించడం, తూకాల్లో మోసం చేయడంలాంటివి చేస్తే వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే పత్తి రైతులు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, పట్టా పాస్‌పుస్తకం జిరాక్సులతో పాటు ఒరిజినల్స్ కూడా వెంట తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. కౌలు రైతులు సంబంధిత మండల వ్యవసాయ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రం పొందిన తర్వాత పత్తిని విక్రయించాలని తెలియజేశారు. కొనుగోలు చేసిన అనంతరం రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని అధికారులు తెలిపారు.

56
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles