సంయమనం పాటించాలి

Fri,November 8, 2019 12:56 AM

ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ: అయోధ్య, బాబ్రీ మసీదు విషయంలో సుప్రీం కోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో అన్ని మతాలు, రాజకీయ పార్టీలు సమన్వయం పాటిస్తూ ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా సహకారించాలని ఎస్పీ మల్లారెడ్డి కోరారు. జిల్లా పోలీస్ కార్యాయలంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడా రు. రామజన్మ భూమి, బాబ్రీ మసీదు భూ వివా దంపై సుప్రీం తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంపై సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టులు పెట్టొద్దన్నారు. ఎటువంటి సభలు, ర్యాలీలు, ధర్నా లు నిర్వహించేందుకు అనుమతి లేదన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని కోరారు. లైసెన్స్ ఉన్నా ఎటువంటి మారణాయుధాలు ఉపయోగించవద్దని పేర్కొన్నారు. గుడి, మసీదుల వద్ద గుంపులుగా ఏర్పడి చర్చలు చేయవద్దన్నారు. బ్యా నర్లు, పోస్టర్లు, ఫ్లెక్సీలు అనుమతి లేకుండా ఏర్పా టు చేయరాదని తెలిపారు. మతపరమైన విద్వేషా లు రెచ్చగొట్టేలా వ్యవహరించిన వారిపై కఠిన చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు. ఎదుటివారి మనోభావాలను కించ పరచద్దన్నారు. తీర్పు వెలువడే వరకు ఈ విషయంలో సామాజిక మాధ్యమాల ద్వారా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలను చైతన్యం చేయడం జ రుగుతుందని చెప్పారు.

34
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles