అర్హులందరికీ పింఛన్

Fri,November 8, 2019 12:56 AM

ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ: అర్హులైన ప్ర తి ఒక్కరికీ పింఛన్ అందిస్తామని జిల్లా పరిషత్ సీఈవో వేణు హామీ ఇచ్చారు. ఎంపీడీవో కార్యా లయ సమావేశ మందిరంలో పెన్షన్ ఆదాలత్ లో ముఖ్య ఆతిథిగా పాల్గొన్నారు. ఆయన మా ట్లాడుతూ ప్రభుత్వం అందజేస్తున్న వృద్ధాప్య, ఒంటరి మహిళ, వికలాంగులు, బీడీ, గీత, చేనే త కార్మికులకు పింఛన్ ఆధించడం జరుగుతుందన్నారు. ఎంపీపీ మల్లికార్జున్ యాదవ్ మాట్లాడుతూ మండలంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తామని చెప్పారు. అవుడం గ్రామపంచాయతీలో డప్పింగ్ యార్డు త్వరగా పూర్తి చేయాలని ఆధికారులను ఆదేశించారు. మార్కె ట్ కమిటీ మాజీ చైర్మన్ గంధం శ్రీనివాస్,ఎంపీటీసీ లింగు, సర్పంచ్ గుణక గిరిజ, శ్రీనివాస్, బాబూరావు, నాయకులు గడ్డలా సురేశ్, ఎంపీడీవో రమేశ్ కుమార్,ప్రత్యేక ఆధికారి రవికృష్ణ, కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

32
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles