తెల్ల బంగారానికి తెగులు..

Thu,November 7, 2019 12:15 AM

-నల్లబడి రాలిపోతున్న ఆకులు, కాయలు
-దిగుబడిపై తీవ్ర ప్రభావం
-ఆందోళనలో రైతులు

కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో లక్షా 38 వేల హెక్టార్ల సాగుభూమి ఉండగా, ఈ ఏడాది 85 వేల హెక్టార్లలో పత్తి సాగు చేస్తున్నారు. ప్రభు త్వం ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర కల్పిస్తుండడంతో గతేడాది కంటే సుమారు 8 వేల హెక్టార్లలో ఈ ఏడాది అదనంగా పత్తి సాగుచేశారు. ఈ ఏడాది కురిసిన వర్షాలతో గతేడాదికంటే దిగుబడి బాగా వస్తుందని రైతులు, అధికారులు అంచనాలు వేశా రు. పత్తి పంట మంచి కాత, పూత దశలో ఉండి పంట చేతికి వస్తున్న సమయంలో వర్షాలు కురుస్తుండడంతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. పత్తికి తెగుళ్లు సోకడంతో ఆకులు, కాయలు నల్లబడి పోయి రాలిపోతున్నాయి.
పత్తి ఏరాల్సిన సమయంలో వర్షాలు కురుస్తుండడంతో నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాగా పెరిగిన పత్తి చెట్లకు సరైన విధంగా గాలి, వెలుతురు, సూర్యరశ్మి తగులకపోవడం, రోజూ చినుకులు పడడంతో పత్తికి తెగుళ్లు వస్తున్నాయని అధికారులు అంటున్నారు. జిల్లాలో ఎక్కువగా ఎత్తుపల్లాల భూములు ఉన్నాయి. లోతట్టు ప్రాం తాల్లోని చేలల్లో నీరు నిలిచి.. భూమి ఆరడం లేదు. దీంతో పత్తి చేలల్లో గడ్డికూ డా బాగా పెరుగుతోంది. దీంతో పత్తి చెట్లు నల్లగా మారడం, ఆకులు ఎండిపోవడం, కాయలు రాలిపోవడం జరుగుతుంది.

దిగుబడిపై తీవ్రమైన ప్రభావం..
వాతావరణ పరిస్థితులు ఇలాగే ఉంటే.. పత్తి దిగుబడిపై తీవ్ర ప్రభావం పడే అవకా శం ఉందని అధికారులు అంచనా వేస్తున్నా రు. గతేడాది సుమారు లక్షా 30 వేల క్విం టాళ్ల పత్తి అంచనా వేయగా.. అధికారుల అంచనాలకు తగ్గట్లుగానే దిగుబడి వచ్చిం ది. గతేడాదికంటే ఈసారి సుమారు 8 వేల హెక్టార్లు పెరిగింది. ఈ ఏడాది సుమారు లక్షా 50 వేల నుంచి 2 లక్షల క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని అంచాన వేశారు. కానీ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో దిగుబడిపై ప్రభావం చూపే ఆ స్కారం ఉంది.

సస్యరక్షణ చర్యలు తప్పనిసరి
ప్రస్తుత సమయంలో పత్తికి వస్తున్న తెగుళ్లను నివారించేందుకు రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. దీంతో తెగుళ్ల బెడద కొంత మేరకు తగ్గడంతో పాటు కాయలు రాలిపోకుండా నివారించవచ్చని అంటున్నారు. మొదటి దశలో రావాల్సిన పత్తి పంటను ఇప్పటికే నష్టపోయామని రైతులు ఆందోళన చెంతుండగా.. ఆకాశంలో పడుతున్న మబ్బులు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles