బీమా చేయించుకోవాలి

Thu,November 7, 2019 12:14 AM

వాంకిడి: ఖాతాదారులు ప్రతి ఒక్కరూ బీమా చేయించుకోవాలని ఎల్‌డీఎం రామ య్య సూచించారు. ఎస్‌బీఐ బ్యాంక్ వాం కిడి శాఖ ఆధ్వర్యంలో దాబా గ్రామంలో బీమా ప్రయోజనాలపై బుధవారం అవగాహన కల్పించారు. ప్రధాన మంత్రి జీవన్‌జ్యోతి బీమా పథకం కింద 18 నుంచి 50 ఏండ్లలోపు వయస్సున్న వారు ఏడాదికి రూ. 330 చెల్లించి సహజ మరణానికి కూడా రెండు లక్షల బీమా పొందవచ్చ న్నారు. ప్రధాన మంత్రి సురక్షా బీమా పథ కం కింద 18 నుంచి 70 ఏండ్ల లోపు వారు ఏడాది రూ. 12 చెల్లించి రెండు లక్షల ప్రమాద బీమా పొందవచ్చాన్నారు. అటల్ పెన్షన్ యోజన కింద 18 నుంచి 40 ఏండ్ల వయస్సు కలిగిన వారు తాము చెల్లిం చే సొమ్మును బట్టి 60 ఏళ్లుబడిన తర్వాత వృద్ధాప్య పింఛన్ పొందవచ్చని సూచించా రు. ఇలాంటి బీమాతో కుటుంబ పోషణకు ఆధారం ఉంటుందని చెప్పారు. బీమాతో పాటు బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తే, వడ్డీలేని రుణాలను పొం దడంతో పాటు బీమా పథకాలు కుడా వర్తిస్తాయని సూచించారు. సర్పంచ్ సుమిత్ర, బ్యాంక్ మేనేజర్ గోపాల్, సర్వీస్ పాయిం ట్ నిర్వాహకుడు పిప్పిరి భిక్షపతి ఉన్నారు.

35
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles