రోగులకు మెరుగైన సేవలందించాలి

Thu,November 7, 2019 12:13 AM

కెరమెరి: దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో సుధాకర్ నాయక్ అన్నా రు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవా రం తనిఖీ చేశారు. అనంతరం సిబ్బందితో ఆయన మాట్లాడు తూ.. గ్రామీణ ప్రాంతప్రజల్లో సర్కారు దవాఖానపై నమ్మకం కలిగించేలా చూడాలన్నారు. జ్వరాలపై ఏ మాత్రం నిర్లక్ష్యం వ హించకుండా రక్త నమూనాలు సేకరించాలని సిబ్బందిని ఆదేశించారు. వ్యాధి నిర్ధారణ అయ్యాకే వైద్యం అందించాలని సూచించారు. ఎ ప్పటికప్పుడూ గ్రామాల్లో పర్యటిస్తూ ప రిస్థితులపై ఆరా తీయాలనీ, గర్భిణుల ఆ రోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రక్తహీనత ఏర్పడకుం డా మందులతో పాటు పౌష్ఠికాహారంపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. గర్భిణులను అంబులెన్స్‌లో దవాఖానకు తీ సుకొచ్చి సుఖప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి సుంకన్న, సూపర్‌వైజర్ మెస్రం సోము, సిబ్బంది తదితరులున్నారు.

24
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles