కిటకిటలాడిన టోంకిని ఆలయం

Wed,November 6, 2019 01:37 AM

సిర్పూర్‌(టి)రూరల్‌: మండలంలోని శ్రీసిద్ధి టోంకిని హ నుమాన్‌ ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. 18వ మహాపాదయాత్రతో భక్తులు తరలి వచ్చి ఆలయంలో ము డుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. సిర్పూర్‌(టి) , కాగజ్‌నగర్‌, కౌటాల, బెజ్జూర్‌, దహెగాం,రెబ్బెన, బెల్లంపల్లి మంచిర్యాల పట్టణాలతోపాట మహారాష్ట్రలోని పోడ్స, అంతర్‌గాం, గోండిపి ప్రి గ్రామాల నుంచి సుమారు 30 వేల మంది భక్తులు తరలివ చ్చారు. పెన్‌గంగలో స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీకమాసంలో భక్తులు హనుమాన్‌ మాలాధారణ చేయడంతో పాటు పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండి పూజలు నిర్వ హించనున్నారు. ఆలయ ప్రాంగణంలో కమిటీ ఆధ్వర్యం లో అన్నదానం చేశారు. పలు స్వచ్చంద సంస్థలు, వ్యాపారులు భక్తులకు పాలు, పండ్లు, ఫలహారాలు, తేనీరు, నిమ్మరసం అందజేశారు. సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పాల్గొని ప్రత్యేక పూ జ లు నిర్వహించారు. అడిషనల్‌ ఎస్పీ వైవీఎస్‌ సుధీంద్ర, డీఎస్పీ డీఎల్‌ఎన్‌ స్వామి, కౌటాల సీఐ మోహన్‌, కాగజ్‌నగర్‌ సీఐ నరేందర్‌, ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles