ముగిసిన రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు

Sat,October 12, 2019 11:34 PM

ముప్కాల్‌ : నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌ మం డల కేంద్రంలోని చైతన్య యూత్‌ క్లబ్‌ క్రీడా మైదానంలో ఈ నెల 10 న ప్రారంభమైన 39వ తెలంగాణ రాష్ట్రస్థాయి అండర్‌-18 ఖోఖో బాలబాలికల పోటీలు శనివారం ముగిశాయి. ముఖ్య అతిథిగా రాష్ట్ర హౌసింగ్‌, రోడ్లు భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. క్రీడల్లో గెలుపోటములు సహజమన్నారు. ఖోఖో పోటీలు నిర్వహించిన ముప్కాల్‌ గ్రామస్తులు, మాజీ క్రీడాకారులకు, యువకులకు మంత్రి ప్ర త్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. టోర్నీ నిర్వహణకు సహాయ సహకారాలు అందించిన వలంటీర్లు, పీఈటీలు, పీడీలను అభినందించారు.

టాస్‌ వేసి..
మొదట మంత్రి ప్రశాంత్‌రెడ్డికి క్రీడాకారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మైదానంలో క్రీడాకారులను పరిచయం చేసుకొని టాస్‌ వేసి మ్యచ్‌ను ప్రారంభించారు. వరంగల్‌, రంగారెడ్డి జట్లు తలపడగా.. మూడు పాయింట్లతో వరంగల్‌ జట్టు విజేతగా నిలిచింది. విజేత జట్లకు మంత్రి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సామ పద్మ, జడ్పీటీసీ బద్ద నర్సవ్వ, ఆర్మూర్‌ ఆర్డీవో శ్రీనివాస్‌, ఇన్‌చార్జి తసిల్దార్‌ ఇస్మాయిల్‌, సర్పంచ్‌ కొమ్ముల శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు ముస్కు భూమేశ్వర్‌, ఎంపీటీసీ పద్మ, జిల్లా అధ్యక్షుడు ఎండీ అతికుల్లా, జిల్లా ఖోఖో అసోసియేషన్‌ చైర్మన్‌ సంతోష్‌, పీఈటీలు విద్యాసాగర్‌రెడ్డి, రాజ్‌కుమార్‌, మండల కోఆప్షన్‌ సభ్యులు మునీరొద్ద్దీన్‌, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు సామ వెంకట్‌ రెడ్డి, బద్దం నర్సారెడ్డి, జీవీ భూమారెడ్డి, రాజేందర్‌, సీనియర్‌ క్రీడాకారులు కె.గంగాధర్‌, టీ.సాయన్న, గంగాధర్‌, బాల్‌రాజు, శ్రీనివాస్‌, శ్రీకాంత్‌, హరీశ్‌, వీడీసీ ప్రెసిడెంట్‌ శ్రీనివాస్‌గౌడ్‌, సెక్రెటరీ కొమ్ముల రవి, క్రీడాకారులు పాల్గ్గొన్నారు.

విజేతలుగా వరంగల్‌, రంగారెడ్డి జట్లు..
ఫైనల్‌ బాలురు విభాగంలో వరంగల్‌, రంగారెడ్డి తలపడగా.. వరంగల్‌ విజేతగా నిలిచింది. రెండు రౌండ్లలో రంగారెడ్డి జట్టు 16 పాయింట్లు సాధించగా.. వరంగల్‌ జట్టు 17 పాయింట్లు సాధించి పాయింట్‌ తేడాతో గెలుపొందింది. బాలికల విభాగంలో రంగారెడ్డి, నల్గ్గొండ తలపడగా.. రంగారెడ్డి విజేతగా నిలిచింది. రెండు రౌండ్లలో రంగారెడ్డి 9 పాయింట్లు సాధించింది. నల్గొండ 8 పాయింట్లు సాధించగా.. పాయింట్‌ ఆధిక్యంతో రంగారెడ్డి విజేతగా నిలిచింది. సెమీ ఫైనల్‌లో కరీంనగర్‌, నిజామాబాద్‌ బాలికల జట్లు తలపడగా.. నిజామాబాద్‌ తృతీ య స్థానంలో నిలిచిందని నిర్వాహకులు తెలిపారు.

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles