పశువుల కాపరి మృతదేహం లభ్యం

Sat,October 12, 2019 11:34 PM

దహెగాం: మండల కేంద్రానికి చెందిన పశువుల కాపరి సామెర సత్తయ్య(42) శుక్రవారం పెద్దవాగులో గల్లంతు కాగా శనివారం మృతదేహం లభ్యమైందని ఏఎస్‌ఐ మల్లేశం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. సత్తయ్య పశువులను మేపే క్రమంలో పెద్దవాగు దాటుతుండగా వరద ఉధృతికి గల్లంతయ్యాడు. శుక్రవారం గాలించినప్పటికి ఆచూకీ దొరకలేదు. శనివారం ఉదయం పాత పంబాపూర్‌ శివారు పెద్దవాగులో మృతదేహం లభ్యమైంది. అతని భార్య సుమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పంచనామ నిర్వహించి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్‌ఐ తెలిపారు. మృతునికి భార్యతో పాటు ముగ్గురు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles