మౌలిక సదుపాయాలు కల్పించాలి

Sat,October 12, 2019 12:32 AM

మందమర్రి : పట్టణంలోని మార్కెట్‌లో మౌలిక సదుపాయాలను మెరుగు పర్చాలని వ్యాపార సంఘం నాయకులు మున్సిపల్ అధికారులను కోరారు. మున్సిపల్ కమిషనర్ కే బాపు సిబ్బంది, వ్యాపార సంఘం నాయకులతో కలిసి శుక్రవారం మార్కెట్‌ను పరిశీలించారు. వ్యాపార సంఘం నాయకులు మార్కెట్‌లో నెలకొన్న సమస్యలను అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధానికి సహకరించాలని కోరారు. అనంతరం మున్సిపల్ అధికారులు, వ్యాపార సంఘం నాయకులతో మున్సిపల్ అధికారులు సమావేశమయ్యారు. తన పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని కమిషనర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్‌చార్జి మేనేజర్ చిట్టిబాబు, భుజంగరావు, లక్ష్మీకాంతారావు, వ్యాపార సం ఘం అధ్యక్షుడు తమ్మిశెట్టి విజయ్, నాయకులు పాల్గొన్నారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles