పశువులను రోడ్లపై వదిలితే చర్యలు

Sat,October 12, 2019 12:32 AM

తిర్యాణి: యజమానులు పశువులను రోడ్లపై వదిలితే చర్యలు తప్పవని ఎస్‌ఐ రామారావు హెచ్చరించారు. పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని భీమారం, తలాండి గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పశుయజమానులతో మాట్లాడుతూ పశువులను విచ్చలవిడిగా వదిలివేయడంతో పంట చేన్లను నాశనం చేయడంతో పాటు రాత్రి వేళల్లో రోడ్లపై ఉండడంతో వాహనదారులు ప్రమాదాల బారినపడుతున్నారని పలు గ్రామాల ప్రజలు తమ దృష్టికి తీసుకవచ్చారన్నారు. పశువులను రాత్రి సమయంలో కట్టివేయడంతో పాటు తగిన చర్యలు తీసుకోవాలని లేనిచో కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తప్పకుండా నిబంధనలు పాటించి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు బొమ్మగోని శంకర్‌గౌడ్, బీఎస్‌ఎన్‌ల్ డైరెక్టర్ కిలిశెట్టి శంకరయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.

పిచికారీ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి
పంటలకు క్రిమిసంహారక మందులు పిచికారీ చేసే సమయంలో రైతులు తగిన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఐ రామారావు అన్నారు. పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని కుమ్రం భీం చౌరస్తాలో రైతులకు క్రిమిసంహారక మందుల పిచికారీ చేసేటప్పుడు తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పంటలకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల సమయంలోనే పిచికారీ చేయాలని సూచించారు. ఎలాంటి పురుగుమందులనైనా సంబంధిత వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు, తదితరులు పాల్గొన్నారు.

34
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles