పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యంముగిసిన అటెస్టేషన్ పత్రాల స్వీకరణ

Sat,October 12, 2019 12:31 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ: కానిస్టేబుల్ ఉద్యోగాల కో సం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎంపికైన అభ్యర్థుల అటెస్టేషన్ పత్రాల స్వీకరణ శుక్రవారం ముగిసింది. జిల్లా కేంద్రంలో స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో ఎస్పీ విష్ణువారియార్ పర్యవేక్షణలో కొనసాగింది. ధ్రువపత్రాల పరిశీలన, అటెస్టేషన్ పత్రాల స్వీకరణతో పాటు రెండు సెట్లు జిరాక్స్ కాపీలు స్వీకరించారు. ఉమ్మ డి జిల్లాలోని 506మంది అభ్యర్థులకు మొదటిరోజు 224, రెం డో రోజు 211, మూడో రోజు 32మంది అభ్యర్థులు హాజరు కాగా 36మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ముగ్గురు అభ్యర్థులు ఉద్యోగం వద్దని లిఖిత పూర్వక పత్రాలను అందజేశారు. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 467 మంది అభ్యర్థులు పరిశీలన ప్రక్రియ పూర్తి చేసుకున్నారు.

రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ హైదరాబాద్ అడిషనల్ డీజీపీని సంప్రదించి వారి ఆదేశాల మేరకు గైర్హాజరైన అభ్యర్థుల ఫోన్ నెంబర్ల ద్వారా వివరాలు తెలుసుకొని చర్యలు తీసుకోనున్నారు. అదనపు ఎస్పీ టీఎస్ రవికుమార్ శిక్షణ కేంద్రం డీఎస్పీ ఎల్‌సీ నాయక్, ఏఆర్ డీఎస్పీ సయ్యద్ సుజాఉద్దీన్, పోలీస్ కార్యాలయం అధికారులు ఎంఏ జోసెఫిన్, సందీప్, కొండరాజు, జగదీశ్, మురళీ, కంప్యూటర్ విభాగం అధికారులు ఎంఏ జోసెఫిన్, సందీప్, కొండరాజు, జగదీశ్, మురళీ, కంప్యూటర్ విభాగం అధికారులు సింగజ్‌వార్ సంజీవ్‌కుమార్, రియాజ్, మాజిద్, సహరే కిశోర్ ఆర్‌ఐలు ఓ.సుధాకర్‌రావు, కే.ఇంద్రవర్దన్ తదితరులు పాల్గొన్నారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles