అర్హులందరికీ ఆసరా పింఛన్లు

Sat,October 12, 2019 12:30 AM

రెబ్బెన : అర్హులందరికీ ఆసరా పింఛన్లు అందిస్తామ ని డీఆర్డీఏ వెంకట్‌శైలేశ్ అన్నారు. మండల కేం ద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మండలంలో పింఛన్ తీసుకుంటున్నవారిని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు సదరం సర్టిఫికేట్ అందిస్తేనే పింఛన్ వస్తుందనీ, సదరం క్యాంప్‌లో ధ్రువీకరణ పత్రం పొందాలని సూచించారు. పింఛన్ ప్రతి నెలా రాకపోతే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకవచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. రెబ్బెన జడ్పీటీసీ వేముర్ల సంతోశ్ మండలంలో అర్హత ఉన్నప్పటికీ కొంతమందికి పింఛన్ రావడం లేదని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో డ్రైవ్ ఏ ర్పాటు చేశామ న్నారు. పీడీ రా మకృష్ణ, పింఛన్ ఏపీవోలు వసంత్, పొన్న య్య, రెబ్బెన ఎంపీడీవో సత్యనారాయణసింగ్, స్వచ్ఛభారత్ కోఆర్డినేటర్ ఫణికుమార్, సీసీ వరప్రసాద్, ఎంపీపీ జుమ్మిడి సౌందర్య, జడ్పీటీసీ వేముర్ల సంతోశ్, కో ఆప్షన్‌మెంబర్ జౌరోద్దీన్, తక్కలపల్లి ఎంపీటీసీ సంఘం శ్రీనివాస్, సర్పంచులు చెన్న సోమశేఖర్, శ్రీనివాస్, పింఛన్‌దారులు పాల్గొన్నారు.

31
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles