తొలిరోజు రెండు

Wed,October 9, 2019 11:17 PM

-మద్యం దుకాణాలకు వచ్చిన దరఖాస్తులు
-ఈనెల 16వ వరకు గడువు..18న డ్రా
-జిల్లాలో 26 షాపులకు నోటిఫికేషన్
-ఈ సారి భారీ పోటీ ఉండే ఛాన్స్
-వచ్చే నెల 1 నుంచి అమల్లోకి కొత్త పాలసీ

ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ: జిల్లాలో 2019-21 సంవత్సరానికి గానూ మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ఈ మేరకు తొలుత ఎక్సైజ్ శాఖ అధికారులు ఉదయం నోటిఫికేషన్ జారీ చేశారు. జి ల్లాలో 26 మద్యం దుకాణాలకు దరఖాస్తుల ప్ర క్రియ ప్రారంభించగా, తొలిరోజు బుధవారం రెండు దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 16 వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుండగా, 18న లక్కీడ్రా నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని కుమ్రం భీం భవనంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు ఆధ్వర్యంలో లాటరీ ద్వారా దుకాణాల కేటాయింపు ప్రకియ కొనసాగనుంది. మద్యం దుకాణాలు దక్కించుకున్నవారు నవంబర్ ఒకటి నుంచి రెండేళ్లపాటు వీటిని నిర్వహించనున్నారు.

ఏజెన్సీ మద్యం దుకాణాల మార్పు
ఏజెన్సీ ప్రాంతంలోని మద్యం దుకాణాలను ప్ర భుత్వం ఆదేశాల మేరకు మార్పు చేశారు. జైనూర్‌కు చెందిన రెండు మద్యం దుకాణాల్లో ఒకటి చింతలమానేపల్లి మండలంలోని రవీంద్రనగర్‌కు, మరొక టి రెబ్బెన మండంలోని గంగాపూర్‌లో ఏర్పాటు చేయనున్నారు. కెరమెరి మండల కేంద్రంలోని దు కాణాన్ని అదే మండలంలోని గోయాగాంకు, తిర్యా ణి మండలంలోని షాపును ఆదే మండలంలోని విజయనగరం కాలనీకి మార్చనున్నారు.

మొదటి రోజు రెండు దరఖాస్తులు
మద్యం షాపుల నిర్వహణకు బుధవారం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా, మొదటి రోజు 2 దరఖాస్తులు వచ్చినట్లు ఆధికారులు తెలిపారు. జిల్లాలో 26 మద్యం షాపులకు జీవో నంబర్ 04లో 1, జీవో నంబర్ 14లో 1 చొప్పున దరఖాస్తులు వచ్చాయి.

గతంలో 557 దరఖాస్తులు
2017-19 సంవత్సరానికి మద్యం దుకాణాల నిర్వహణకు విడుదల చేసిన నోటిఫికేషన్‌లో జిల్లా లో 26 మద్యం షాపులకు గాను 557 ధరఖాస్తులు వచ్చాయి.ఇందులో సిర్పూర్(టి) మండలంలో 53, కౌటాల -1 దుకాణానికి 40, కౌటాల -2 దు కాణానికి 45 దరఖాస్తులు వచ్చాయి. కాగజ్‌నగర్- 1 షాపునకు 14, 2వ 20, 3వ 19, 4వ 28,5వ 15,6వ దుకాణానికి 25,ఈజ్‌గాం షాపునకు 15,దహెగాం కోసం 25, జిల్లా కేంద్రంలోని 1వ దుకాణానికి 12, 2వ దుకాణానికి 10, 3వ దుకాణానికి 9, 4వ దుకాణానికి 8, 5వ దుకాణానికి 11 దరఖాస్తులు వచ్చాయి. రెబ్బెన 1వ దుకాణానికి 27, రెబ్బెన (గోలేటి)దుకాణానికి 8,వాంకిడి 1వ దుకాణానికి 27, 2వ దుకాణానికి 24,కెరమెరిలో 10, జైనూర్ 1వ దుకాణానికి 3, 2 వ దుకాణానికి 2 దరఖాస్తుల చొప్పున మొత్తం 557 దరఖాస్తు వచ్చాయి. ఈఏడాది కేవలం టెండర్ ఫారంతో పాటు రూ. 2 లక్షల డీడీని నిర్ణయించగా, దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

48
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles