భీం వర్ధంతిని వైభవంగా నిర్వహించాలి

Wed,October 9, 2019 11:14 PM

కెరమెరి : కుమ్రం భీం వర్ధంతిని వైభవంగా నిర్వహించుకుందామని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నా రు. బుధవారం మండలంలోని జోడేఘాట్‌లో ఎస్పీ మల్లారెడ్డితో కలిసి పర్యటించారు. ముం దుగా భీం సమాధి వద్ద పూజలు నిర్వహించి నివాళులర్పించారు. అనంతరం మ్యూజియంను సందర్శించి పనులను పర్యవేక్షించారు. సభ నిర్వహణ, భోజన స్థలం, వాహనాల పార్కింగ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్ధంతికి రాష్ట్రంతో పాటు ఇతర రాష్ర్టాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉందన్నా రు. వారికి రవాణ, భోజనం, తాగునీటి సౌకర్యం ఉత్సవ కమిటీ సభ్యులు చూసుకోవాలన్నారు. అదేవిధంగా ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయలతో కార్యక్రమాలు నిర్వహించేలా చూడాలని కోరారు. అనంతరం ఎస్పీ మల్లారెడ్డి మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హట్టి నుంచి జోడేఘాట్ వరకు అవసరమున్న చోట బందోబస్తు ఏర్పాటు చేయాలని డీఎస్పీ సత్యనారాయణకు సూచించారు. వీఐపీలు వచ్చే అవకాశం ఉన్నందున హెలీప్యాడ్ ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ పేందోర్ రాజేశ్వర్, ఎంపీపీ పేందోర్ మోతీరాం, ఎస్‌ఐ రమేశ్, భాస్కర్, మ్యూజియం అసిస్టెంట్ క్యూరేటర్ విశ్వంరావ్, ఆదివాసీ నా యకులు కుమ్రం భీంరావ్, మడవి భారత్, పూసం భీంరావ్, తుకారాం, ఆత్రం భొజ్జీరావ్, సెడ్మకి అమృత్‌రావ్, కుమ్రం నానేశ్వర్ పాల్గొన్నారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles