రెండునెలల్లో మరమ్మతులు

Wed,October 9, 2019 11:14 PM

బెజ్జూర్ : ఇటీవల కురిసిన వర్షాలకు గుంతలమం గా మారిన రోడ్లకు రెండునెలల్లో మరమ్మతులు చేయిస్తామని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. బుధవారం మండల కేంద్రంలో శ్రీయోగేశ్వర హోటల్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం బెజ్జూర్ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కాగజ్‌నగర్ - బెజ్జూర్ వయా కడంబా రోడ్డుకు త్వరలో బీటీ వేయనున్నట్లు చెప్పారు. అదేవిధం గా కౌటాల, పెంచికల్‌పేట రూట్‌లలో కూడాపనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కుకుడ వాగు వంతెనకు అప్రోచ్ రోడ్డు, చిన్న సిద్దాపూర్ వాగుపై వంతెన పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 30 రోజుల ప్రణాళికలో సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొని గ్రామాలను బాగు చేసుకున్నారన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పంద్రం పుష్ఫలత, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు అర్షద్ హుస్సేన్, జిల్లా సభ్యుడి కోండ్ర జగ్గాగౌడ్, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు సిడాం సకారాం, నాయకులు కుర్సింగ ఓంప్రకాశ్, కోండ్ర మనోహర్ గౌడ్, రేణుకుంట్ల పెంట య్య, సర్పంచులు అన్సార్ హుస్సేన్, బుజాడి శేఖర్, తలండి తిరుపతి, సిడాం భీంరావ్, కుంరం హన్మంతు, పొర్తెటి రవి, రేణుకుంట్ల సంతోష్, ఎంపీటీసీ ఆత్రం సాయి, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

32
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles