సొంతూరి కోసం ఎమ్మెల్సీ పురాణం విరాళం

Wed,October 9, 2019 11:14 PM

కోటపల్లి : కోటపల్లి పంచాయతీ అభివృద్ధి కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ రూ.51,116 విరాళం అందించారు. విజయ దశమి వేడుకల్లో పాల్గొనేందకు వచ్చిన ఎమ్మెల్సీ 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామంలో చేపట్టిన అభివృద్ధిని చూసి తనవంతుగా రూ.51,116 చెక్కును సర్పంచ్ రాగం రాజక్కకు అందించారు. గ్రామాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించిన 30 రోజుల ప్రణాళిక కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదన్నారు. సీఎం కేసీఆర్ గ్రా మాల అభివృద్ధికి పంచాయతీ రాజ్ చట్టాన్ని పటిష్టం చేశాడని కొనియడారు. తన స్వగ్రామం కోటపల్లి అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, విజయ దశమి నుంచి గ్రామస్తులకు అందుబాటులో ఉంటూ గ్రామ రూపురేఖలు మార్చేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొమిరెళ్లి విజయ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బైస ప్రభాకర్, నాయకులు రాగం స్వామి, చింత మధూకర్, కొంకటి సుందర్, సుధాకర్ పాల్గొన్నారు.

36
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles