మద్యం పాలసీ ఖరారు

Tue,October 8, 2019 01:13 AM

ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ : 2019-2021 సంవత్సరానికి జిల్లాలో 26 మద్యం దుకాణాల కోసం నోటిఫికేషన్ వెలువడింది. ఈ నెల 9వ తేదీ నుంచి 16వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. 18న కలెక్టర్ సమక్షంలో లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. ఏజెన్సీ ప్రాంతల్లో మద్యం దుకాణాలను ఈ ఏడాది ప్రభుత్వ ఏర్పాటు చేయడం లేదు. జనాభా ప్రాతిపదికన మద్యం షాపులకు టెండర్లు వేశారు.

జిల్లాలో 26 మద్యం షాపులు
జానాభా ప్రతిపదికన ఏజెన్సీ ప్రాంతంలో మినహాయించి జిల్లాలో 26 షాపులను ఏర్పాటు చేసేందుకు అధికారులు ధరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆసిఫాబాద్‌లో 5, వాంకిడి 3, రెబ్బెన ( గంగాపూర్)1, రెబ్బెన (గోలేటి) 1, గోయగం ( కెరమరి మండలం)-1, తిర్యాణి మండలం( గోయాగం)లో 1, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో 6, సిర్పూర్(టి) 1, కౌటాల 2, బెజ్జూర్ 2, రవీంద్రనగర్ (చింతలమానేపల్లి మండలం)1, దహెగాం 1 చొప్పున మద్యం షాపులు సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి.

దరఖాస్తు చేయడం ఇలా...
దరఖాస్తు చేసేందుకు అవసరమగు ఫారం జిల్లా ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో లభిస్తుంది. దరఖాస్తును సరియైన వివరాలతో నింపి, ఆధార్ కార్డు, పాన్ కార్డు, జత చేసి రూ॥ 2 లక్షల డీడీని (డిస్టిక్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి, కుమ్రంభీం ఆసిఫాబాద్) పేరును తీసుకోవాల్సి ఉంటుంది. పూరించిన దరఖాస్తు ఫారంతో పాటు డీడీని కవర్‌లో పెట్టి జిల్లా ఎక్సైజ్ అధికారికి అందించాల్సి ఉంటుంది.

మద్యం దుకాణానికి 3 స్లాబులు
జిల్లాలో 26 మద్యం దుకాణాలకు సంబంధించి చెల్లించాల్సిన ఎక్సైజ్ ట్యాక్స్ మూడు స్లాబులతో చెల్లించాల్సి ఉంటుంది. 8 దుకాణాల రూ. 50 లక్షలు, 12 దుకాణాలు రూ. 55 లక్షలు, 6 దుకాణాలు రూ. 60 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. వీటిని మూడు దఫాలుగా చెల్లించాలని అధికారులు నిర్ణయించారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles