బాలిక మృతి

Tue,October 8, 2019 01:12 AM

జైనూర్: మండలంలోని పాట్నాపూర్ గ్రామానికి చెందిన కుమ్ర మాయత్రి (10)అనే బాలిక జ్వరంతో మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... మాయత్రి ఉట్నూర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో మూడో తరగతి చదువుతుంది. గత కొద్దిరోజులుగా ఛాతినోప్పితో పాటు జ్వరంతో బాధపడుతుండగా దవాఖనలో చికిత్స చేయించారు. ఆమె పరిస్థితి విషమించడంతో ఆదివారం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

విద్యుత్ షాక్‌తో ఆవు మృతి
కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలోని శ్రీనగర్‌కాలనీలో గల ట్రాన్స్‌ఫార్మర్‌కు ఆవు తగిలి మృతి చెందింది. ట్రాన్స్‌పార్మర్‌కు కంచెలేని కారణంగానే విద్యుత్‌షాక్‌తో ఆవు మృతి చెందిందని ఓల్డ్ కాలనీలోని ఆవు యజమాని మల్లికార్జున్‌కు తెలిపారు. తనకు నష్టపరిహారం అందించాలని బాధితుడు కోరారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles