వాగులో గల్లంతైన విద్యార్థి మృతి

Tue,October 8, 2019 01:12 AM

కెరమెరి: మండలంలోని నాగల్‌గొంది గ్రామానికి చెందిన సిడాం రాజరాం(14) అనే విద్యార్థి వాగులో గల్లంతై సోమవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సిడాం రాజరాం హట్టి ఆశ్రమ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. దసరా సెలవులు రావడంతో ఇంటికి చేరుకున్నాడు. ఉదయం రాజరాం చేనుకు వెళ్లి తిరుగు వస్తున్న సమయంలో వాగు దాటుతుండగా నీటి ప్రవహం పెరగడంతో కొట్టుకుపోయాడు. కుటుంబ సభ్యులు కొంత దూరం గాలించగా మృతదేహం లభ్యమైంది. రాజరాం తండ్రి భీము ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్‌ఐ రమేశ్ తెలిపారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles