క్రీడా స్ఫూర్తితో రాణించాలి

Tue,October 8, 2019 01:12 AM

రెబ్బెన: క్రీడాకారులు క్రీడల్లో క్రీడా స్ఫూర్తితో రాణించాలని మాజీ జడ్పీటీసీ అజ్మీర బాబురావు పేర్కొన్నారు. గోలేటి గ్రామంలో దసరా పండుగను పురస్కరించుకొని నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంట్ సోమవారంతో ముగిసింది. గోలేటి సెవెన్ స్టార్ జట్టు మొదటి స్థానంలో నిలువగా 5016 నగదు, కైర్‌గూడ శివసాయి జట్టు రెండో స్థానంలో నిలువగా రూ.2116 నగదు అందజేశారు. కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకుడు గుగులోత్ గోవింద్‌నాయక్, వార్డు సభ్యుడు రవినాయక్, గ్రామస్తులు గోబ్రియానాయక్, లావుడ్య దేవిదాస్, శంకర్, చంద్రగిరి మల్లయ్య, తిరుపతి, నరేందర్ పాల్గొన్నారు.

28
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles