బాధిత కుటుంబాలకు పరామర్శ

Mon,October 7, 2019 01:29 AM

జైనూర్: మండలంలోని పానపటార్ గ్రామానికి చెందిన కుంరం దేవ్‌రావ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే ఆత్రం సక్కు పరామర్శించారు. దేవ్‌రావ్ సమాధి, చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం డబోలి గ్రామాన్ని సందర్శించారు. గత కొద్దిరోజుల క్రితం ఎంపీటీసీ భోజ్జుపటేల్ తనయుడు దీపక్‌కు ప్రమాదవశాత్తు గాయాలు కాగా ఆయనను కలిసి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు ఇంతియాజ్‌లాల, వైస్‌ఎంపీపీ లక్ష్మణ్, కొలాం సంఘం కుమ్రంభీం జిల్లా అధ్యక్షుడు ఆత్రం శంకర్, మాజీ వైస్‌ఎంపీపీ షేక్ రషీద్, సర్పంచ్ భీంరావ్, శ్యాంరావ్, నాగోరావ్, నాయకులు ధరం సింఘ్, బాపురావ్, సుదర్శన్, ఎస్‌ఐ శ్రీనివాస్ ఉన్నారు.

మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు
ఆసిఫాబాద్ టౌన్: జిల్లా కేంద్రంలోని పొట్టి శ్రీ రాములు చౌక్ సమీపంలో గల మహాలక్ష్మి ఆలయంలో మహిళలు ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. లక్ష్మిదేవికి అభిషేకం, పుష్పర్చన, దీపాలంకరణ, దుర్గా పూజను నిర్వహించారు.


పిడుగుపాటుతో ఒకరి మృతి

తిర్యాణి : తిర్యాణి మండలం ఖైరిగూడ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ కనక ఇంద్రుబాయి (55) ఆదివారం పిడుగుపాటుతో మృతి చెం దింది. అదే గ్రామానికి చెందిన వెడ్మ దృపతిబాయి, సోయం లచ్చు, పూసం జంగుబాయి, నైతం మానసలతో కలిసి గ్రామ సమీపంలోని పత్తి చేనులో కలుపు తీస్తుండగా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అందరూ కలిసి చేను సమీపంలోని చెట్టుకిందకు వెళ్లారు. ఒక్కసారిగా పిడుగు పడడంతో కనక ఇంద్రుబాయి అక్కడికక్కడే మృతి చెందగా.. సోయం లచ్చు, వెడ్మ దృపతి బాయికి తీవ్ర గాయాలు కాగా.. మానస, జంగుబాయికి స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు వీరిని గిన్నేదరి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం దృపతిబాయి, సోయం లచ్చును మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. సోయం లచ్చు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

35
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles