దేవీ శరన్నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు

Mon,October 7, 2019 01:28 AM

ఆసిఫాబాద్ టౌన్: శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆదివారం మండలంలోని రాజంపేటలోని ఓం శ్రీ సాయి శారదదేవి మండపం వద్ద వేదపండితుడు నాగేశ్వర్‌శర్మ ఆధ్వర్యంలో మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్‌లోని దుర్గాదేవి మండపం వద్ద అన్నదానం చేపట్టారు. కార్యక్రమంలో కాలనీ వాసులు, భక్తులు పాల్గొన్నారు.

రెబ్బెన: మండల కేంద్రంలోని దుర్గాదేవి ఆలయంలో ఆదివారం జడ్పీచైర్‌పర్సన్ కోవ లక్ష్మి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. అలాగే ఇందిరానగర్ గ్రామంలోని శ్రీ కనక దుర్గాదేవి, స్వయం భూ మహంకాళి ఆలయంలో అమ్మవారు దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ వేముర్ల సంతోశ్, ఎంపీపీ జుమ్మిడి సౌందర్య, వైస్ ఎంపీపీ గజ్జల సత్యనారాయణ, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు పోటు శ్రీధర్‌రెడ్డి, ఏఎంసీ ఉపాధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ, సర్పంచులు బోమ్మినేని అహల్యాదేవి, చెన్న సోమశేఖర్, ఎంపీటీసీ సంఘం శ్రీనివాస్, ఉపసర్పంచ్ మడ్డి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఉపసర్పంచ్ బోమ్మినేని శ్రీధర్, నాయకులు మోడెం సుదర్శన్‌గౌడ్, పల్లె రాజేశ్వర్‌రావు, దుర్గం భరద్వాజ్, జుమ్మిడి ఆనందరావు, సురేశ్‌జైస్వాల్, పందిర్ల మధునయ్య, వినోద్‌జైస్వాల్, రాపర్తి శ్రీనివాస్, అన్నపూర్ణ, అరుణ , తదితరులు పాల్గొన్నారు.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles