రైతు బీమాను సద్వినియోగం చేసుకోవాలి

Sun,October 6, 2019 12:01 AM

కెరమెరి: ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమాను సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి గోపికాంత్ రైతులకు సూచించారు. శనివారం ఝరి గ్రామంలో సర్పంచ్ కుమ్రం నానేశ్వర్ ఆధ్వర్యంలో వ్యవసాయాధికారులు అర్హులైన రైతుల నుంచి రైతుబీమా పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంఏవో మాట్లాడుతూ, కొత్తగా పాస్‌పుస్తకాలు తీసుకొని రైతుబంధు ద్వారా పెట్టుబడి సహాయం పొందిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గతంలో బీమా చేసిన రైతులు రెన్యువల్ చేసుకుంటేనే ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఏఈవో వెంకటేశ్,తదితరులు పాల్గొన్నారు.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles