చెరువులో మునిగి ఒకరి మృతి

Sun,October 6, 2019 12:01 AM

రెబ్బెన: మండలంలోని గోలేటి చెరువులో మునిగి ఒకరు మృతి చెందినట్లు ఎస్‌ఐ రమేశ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గోలేటికి చెందిన వసాకె పెంటు(48) అదే గ్రామానికి చెందిన గుగులోత్ దుదియా వద్ద పాలేరుగా పని చేస్తున్నాడు. శుక్రవారం ఎద్దులను మేపేందుకు గ్రామ సమీపంలోని చెరువు వద్దకు వెళ్లాడు. ఒక ఎద్దు చెరువులోకి దిగడంతో బయటకు తీసుకువచ్చేందుకు పెంటు చెరువులోకి దిగాడు. ఈ క్రమం లో చెరువులోని పిచ్చి మొక్కలు పెంటు కాళ్లకు, చేతులకు చుట్టుకోవడంతో మునిగి పొయాడు. అదే సమయంలో దగ్గరలోని రైతులు లావుడ్య అంబాజీ, సునీత, ఉద్దవ్‌సింగ్‌లు గమనించి కేకలు వేస్తు రావటంతో గ్రామస్తులు చేరుకొని గాలింపు చేపట్టారు. శనివారం పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో పిచ్చి మొక్కల మధ్య ఇరుక్కొని మృతదేహాన్ని బయటకు తీశారు. పెం టుకు భార్య రమ, కుమారుడు, ఇద్దరు కుతూర్లు ఉన్నారు. పెంటు కుమారుడు నగేశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, నాయకు లు సోమశేఖర్, సుబ్బారావులు సందర్శించారు.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles