అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే చర్యలు

Sun,October 6, 2019 12:01 AM

కోటపల్లి : ఎరువులను నిర్ణీత ధర కంటే అధికంగా విక్రయిస్తే చర్యలు తప్పవని కోటపల్లి ఏవో మహేందర్ హెచ్చరించారు. కోటపల్లి, సర్వాయిపేటలోని ఎరువుల దుకాణాలను శనివారం ఆయన తనిఖీ చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారమే ఎరువులను డీలర్లు విక్రయించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే షాప్ లైసెన్స్ రద్దు చేస్తామని డీలర్లను హెచ్చరించారు. షాపులోని బిల్లు బుక్కులను, రైతులకు ఇస్తున్న రశీదులను పరిశీలించారు. రైతులు అవసరం మేరకు ఎరువులు కొనుగోలు చేసి ఉపయోగించుకోవాలన్నారు. అధికంగా కొనడం వల్ల కొరత ఏర్పడడంతో పాటు మిగతా వారికి ఎరువులు అందకుండా పోతున్నాయని చెప్పారు.

36
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles