మున్నూరు కాపులు అన్ని రంగాల్లో రాణించాలి

Sun,October 6, 2019 12:01 AM

ఆసిఫాబాద్ టౌన్: మున్నూరు కాపులు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో మున్నూరు కాపు సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్నూరు కాపులు కలిసికట్టుగా ఉంటూ సంఘాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సం క్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సంఘ భవన నిర్మాణం కోసం జడ్పీ చైర్‌పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో మాట్లాడి నిధుల మంజూరుకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం హరితహారంలో భాగంగా 200 లకు పైగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎం పీపీ మల్లికార్జున్ యాదవ్, వైస్ ఎంపీపీ సుంకరి మంగ, మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్, కో ఆప్షన్ సభ్యుడు అలీ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గం ధం శ్రీనివాస్, యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు గడ్డల సురేశ్, నాయకులు సదాశివ, సతీశ్, పుప్పాల శ్రీనివాస్, మల్లేశ్, వెంకటేశం, పిడుగు తిరుపతి, రుకం ప్రహ్లాద్, ప్రభాకర్, గురుమూర్తి, రవి, ప్ర సాద్, సుధాకర్, రాజశేఖర్, వెంకటస్వామి పాల్గొన్నారు.

34
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles